గౌతమీపుత్ర శాతకర్ణి ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్, కమర్షియల్ హీరోగా 99 చిత్రాలను పూర్తిచేసిన బాలకృష్ణ, తాజాగా నటిస్తున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. 100వ మైలురాయి చేరిన ఆయన కెరీర్‌లో ఈ చిత్రం ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. శ్రీయ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మంచి అభిరుచి వున్న క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం నటుడు బాలకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఫస్ట్‌లుక్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. చారిత్రాత్మక చిత్రాలలో కథానాయకుడిగా అనేక పాత్రలు పోషించిన ఎన్టీ రామారావు వారసుడిగా బాలకృష్ణ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌లో పోరాట యోధుడిగా కనిపిస్తున్నాడు. ఆయన అభిమానులకు ఈ పోస్టర్ విడుదల పండగలా మారింది. ‘బసవతారకపుత్ర బాలకృష్ణ’ అని ఆ పోస్టర్‌పై యూనిట్ సభ్యులు శుభాకాంక్షలు చెప్పారు.