లోఫర్ పేరు విన్నప్పుడు షాక్ అయ్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ హీరోగా కంటే నటుడిగానే గుర్తింపు తెచ్చుకోవాలని చేసే ప్రయత్నంలో వున్నా అని అంటున్నాడు యువ హీరో వరుణ్ తేజ్. ‘ముకుంద’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై రెండో సినిమా ‘కంచె’తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని, ఇపుడు మరో విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న ‘లోఫర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మాత సి.కల్యాణ్ నిర్మించాడు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా వరుణ్‌తేజ్‌తో మాటామంతి.
* సాఫ్ట్ సినిమాల తరువాత మాస్ సినిమా చేయడానికిగల కారణం?
- నేను నటించిన ‘ముకుంద’, ‘కంచె’ చిత్రాలు సాఫ్ట్‌కార్నర్‌లో ఉంటాయి. ‘లోఫర్’ చిత్రం మాత్రం పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. పూరి జగన్నాధ్ స్టైల్లో ఉండే సినిమా ఇది. అన్నిరకాల సినిమాలు చేయాలనే ఈ సినిమాలో నటిస్తున్నా.
* లోఫర్ టైటిల్ విన్నపుడు మీకేమన్పించింది?
- నిజంగా టైటిల్ చెప్పినపుడు చాలా షాక్ అయ్యా. అయితే ముందు కథ చెప్పినపుడు చాలా బాగా నచ్చడంతో చేద్దామని చెప్పాను. ఆ తరువాత టైటిల్ కాస్త కొత్తగా అన్పించింది. షూటింగ్ చేస్తున్నకొద్దీ టైటిల్ సరైనదే అనే నమ్మకానికి వచ్చా.
* కథలో మీకు నచ్చిన పాయింట్ ఏమిటి?
- నేను చేసిన రెండు సినిమాలకు భిన్నంగా వుంటూనే మదర్ సెంటిమెంట్‌తో సాగే సినిమా ఇది. ఖచ్చితంగా ప్రతిఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. షూటింగ్ సమయంలో కూడా కొన్నిసార్లు ఎమోషన్ అయ్యాను.
* పూరితో పనిచేయడం?
- పూరీ జగన్నాధ్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ‘పోకిరి’ సినిమా బాగా నచ్చింది. ఆయనతో పనిచేసే అవకాశం వస్తుందా అని అనుకున్నాను. కానీ మూడో సినిమాకే ఆయనతో పనిచేయడం ఆనందంగా వుంది. పూరితో ఎవరైనా సరే కనెక్ట్ అయిపోతారు. తన వర్కింగ్ స్టైల్ అంత బాగుంటుంది.
* ఈ పాత్రకోసం ఎలా కష్టపడ్డారు?
- ఈ పాత్ర చాలా కొత్తగా వుంటుంది. మనం రెగ్యులర్‌గా చూసే జనాల్లో వుండే పాత్రే. రఫ్ లుక్‌తో కనిపించే స్టైలిష్ దొంగగా కనిపిస్తా.
* హీరోయిన్ గురించి?
- దిశా పటాని ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. తను మంచి నటి అని చెప్పాలి. ము ఖ్యంగా డాన్సు బాగా చేస్తుంది. నేను చేసిన మూడు సినిమాల్లో కూడా బాలీవుడ్ హీరోయినే్ల నటించడం విశేషం.
* మిగతా నటీనటుల గురించి?
- ఈ చిత్రంలో రేవతిగారి పాత్ర అద్భుతంగా వుంటుంది. ఆమెతో పనిచేయడం మర్చిపోలేని అనుభూతి. ఆమెతో చేస్తున్నపుడు కొన్ని సీన్లల్లో ఎమోషన్ అయ్యాను. అలాగే, పోసానిగారి పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఆయన తండ్రి పాత్రలో కన్పిస్తాడు. ఇద్దరం కలిసి దొంగతనాలు వంటివి చేస్తుంటాం.
* పూరి జగన్నాధ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవ్వాలనుకున్నారట?
- నిజమే. ‘చిరుత’ సినిమా సమయంలో పూరి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేద్దామని అనుకున్నాను. పూరికి నాన్నతో మంచి రిలేషన్ వుంది. దాంతో ఆయన అడిగాడు కూడా. కానీ నేనే చేరలేదు.
* మరి మెగా హీరోలతో మల్టీస్టారర్?
- తప్పకుండా చేస్తా. అలాంటి కథ దొరకాలి కదా!
* ఈమధ్య ఆడియో ఫంక్షన్‌లో అందరూ అసహనానికి గురయ్యారని విన్నాం. దాని గురించి?
- అలాంటిదేం లేదు. ఆడియో ఫంక్షన్‌లో పవన్ బాబాయ్ కోసం అభిమానులు గోల చేశారు. ఆయన ఎప్పుడూ బయటికి రారు కాబట్టి ఆయన్ను చూడాలనే ఉత్సాహంతో అలా చేశారు.
* నిర్మాత గురించి?
- ఈ సినిమాకు సి.కల్యాణ్‌గారు ఎంతో సపోర్టు అందించారు. ముఖ్యంగా చాలా విషయాల్లో గ్రాండియర్ లుక్ కోసం ఖర్చుపెట్టారు. ఆయన ప్రొడక్షన్ విలువలు బాగుంటాయి.
* చిరంజీవి ఏ సినిమా రీమేక్ చేయాలనుకుంటున్నారు?
- పెద్దనాన్నగారి సినిమాలంటే నాకిష్టం. ఆయన్ని చూసే హీరో అవ్వాలని అనుకున్నాను. ఒకవేళ ఆయన సినిమాలు రీమేక్ చేయాలన్పిస్తే ఛాలెంజ్ సినిమా చేస్తా.
* తదుపరి చిత్రాలు
- క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వస్తోంది. దాంతోపాటు కథలు కూడా వింటున్నాను. మంచి కథలు వస్తే స్పీడ్‌గానే సినిమాలు చేయాలనుంది.

-శ్రీ