17న రానున్న జెంటిల్‌మేన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని, సురభి, నివేదా థామస్ ప్రధాన తారాగణంగా శ్రీదేవి మూవీస్ పతాకంపై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ రూపొందించిన జెంటిల్‌మెన్ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన పాటలకు, టీజర్‌కు, ట్రైలర్లకు మంచి స్పందన లభించిందని, సెన్సార్‌వారు క్లీన్ యు సర్ట్ఫికెట్ ఇచ్చి సినిమాను అభినందించారని తెలిపారు. కుటుంబమంతా కలసి చూడదగిన విధంగా తెరకెక్కిన ఈ చిత్రానికి జెంటిల్‌మెన్ అనే పేరు ఎందుకు పెట్టాము అనేది సినిమా చూసే తెలుసుకోవాలని ఆయన అన్నారు. రీ రికార్డింగ్ హైలెట్‌గా సాగే ఈ చిత్రం అందమైన రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుందని, అన్ని రకాల భావోద్వేగాలు పాత్రల మధ్య ఉంటాయని ఆయన తెలిపారు. అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెనె్నల కిషోర్, ఆనంద్, రోహిణి, సత్యం రాజేష్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీనాయర్, శ్రీముఖి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: డేవిట్ నాదన్, సంగీతం: మణిశర్మ, కెమెరా: పి.జి.విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.