జోరు పెంచింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న మిల్కీ బ్యూటీ
తమన్నాకు తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. మరోవైపు బాలీవుడ్‌లో కూడా అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈ భామ ఇపుడు టాలీవుడ్‌లో హాట్ క్రేజీగా నిలిచింది. ఇటీవలే ఆమె నటించిన బెంగాల్ టైగర్ చిత్రంలో గ్లామర్‌ను ఆరబోసి సంచలనం సృష్టించింది. దీంతో ఇపుడు అందరూ తమన్నా వైపే చూస్తున్నారు. తమ తమ చిత్రాల్లో తమన్నానే హీరోయిన్‌గా పెట్టుకోవాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు కూడా. ముఖ్యంగా తమన్నాతో ‘రచ్చ’, ‘బెంగాల్‌టైగర్’ చిత్రాల్ని చేసిన సంపత్‌నంది మరోసారి ఈమెతో పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు. సంపత్‌నంది దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటించే చిత్రం త్వరలోనే వుంటుందట. ఈ చిత్రంలో కూడా తమన్నానే హీరోయిన్‌గా నటిస్తుందని వార్తలొస్తున్నాయి. ఏదేమైనా తనదైన గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న
తమన్నాకు ఇపుడు అవకాశాల జోరు బాగానే పెరిగింది మరి!