‘జై మాహిష్మతి’ బాహుబలి-2 షూటింగ్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన బాహుబలి చిత్రానికి సంబంధించిన చివరి సన్నివేశాన్ని చిత్రీకరించారు. బహుబలికి సీక్వెల్‌గా వస్తోన్న ‘బాహుబలి ది కంక్లూజన్’ షూటింగ్ మొత్తానికి పూర్తయింది. హైదరాబాద్‌లో ఎంతోకాలంగా శ్రమించి రూపొందించిన పథకం ప్రకారంగా ‘బాహుబలి’ షూటింగ్ జరుగుతోంది. దాదాపు పదివారాలపాటు జరిగే ఈ క్లైమా క్స్ ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తయింది. మొదటిరోజు షూటింగ్ అయిపోగానే టీమ్ అంతా ఒకచోట చేరి ‘జై మాహిష్మతి’ అంటూ షూటింగ్‌కు స్వస్తిపలికారు. దీనికి సంబంధించిన ఫొటోను, వీడియోను కూడా అభిమానుల కోసం విడుదల చేసి విశేషాలను రాజవౌళి వివరించారు. బాహుబలిని మించేలా అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.