పూరితో మూడు భాషల్లో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బ్రహ్మోత్సవం’ సినిమా తరువాత మహేష్‌బాబు హీరోగా నటించే తదుపరి చిత్రానికి సన్నాహాలు జోరందుకున్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం జూలైలో ప్రారంభం కానుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా తరువాత మరో చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. మహేష్-పూరిల కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్‌మాన్’ చిత్రాలు సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్‌లో రూపొందే ‘జనగణమన’ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్‌వర్క్ చివరిదశలో వుందని తెలిసింది. మరోవైపు పూరి జగన్నాథ్‌కు ఈమధ్య కమర్షియల్‌గా సరైన విజయం లేకపోవడంతో మహేష్ సినిమాతో మళ్లీ తన ఉనికిని చాటుకోవాలనే ప్రయత్నాల్లో వున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లోనే కాకుండా కన్నడలో కూడా విడుదల చేస్తారట. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాల్ని ప్రకటిస్తారని తెలిసింది.