వెంకి-మారుతి చిత్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తొలిసారిగా వెంకటేష్, మారుతి కాంబినేషనల్‌లో సూర్యదేవర నాగవంశి రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలోబుధవారం జరిగింది. తొలి షాట్‌కు అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా సురేష్ బాబు కెమెరా స్విచాన్ చేసారు. తొలి సన్నివేశానికి వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ఎప్పటినుండో వెంకటేష్ కధానాయకుడిగా సినిమా రూపొందించే ప్రయత్నం చేస్తున్నానని, ఇప్పుడు మారుతి దర్శకత్వంలో నిర్మించే అవకాశం వచ్చిందని తెలిపారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి పాటలు రికార్డు చేసామని, అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందుతుందని అన్నారు. నేటినుండే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే సంవత్సరం ప్రధమార్ధంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఓ అద్భుతమైన కథా కథనంతో యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. బ్రహ్మానందం, మురళి శర్మ, జయప్రకాశ్‌రెడ్డి, దేవ్‌గిల్, పృధ్వి, వెనె్నల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం-జీబ్రాన్, కెమెరా-వివేక్ ఆనంద్, ఎడిటింగ్-ఎస్.బి.ఉద్ధవ్,నిర్మాత-సూర్యదేవర నాగవంశి, రచనా దర్శకత్వం-మారుతి