వంద ముద్దులు... వెయ్యి తన్నులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ ట్విట్టర్‌ను వేదికగా చేసుకొని పలు సంచలన కామెంట్లతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఇప్పటికే పలువురిపై కామెంట్లు చేసిన వర్మ తాజాగా, ఈమధ్యే రజనీకాంత్‌ని టార్గెట్ చేస్తూ ఆయన అభిమానులకు కోపం తెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్మ రజనీని పొగుడుతూ చేసిన ట్విట్ అందరికీ షాక్ ఇస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ వంద ముద్దులకు అర్హుడని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ‘కబాలి’ చిత్రంలోని ‘నిరుప్పడా’ పాట టీజర్‌ను చూసిన వర్మ పైవిధంగా స్పందించాడు. అందులోనే ఆయన మరోమాట కూడా చెబుతూ- ‘సబ్‌టైటిలింగ్‌కు బాధ్యుడైన వ్యక్తిని వెయ్యి తన్నులు తన్నండి’ అని ట్విట్ చేయడం విశేషం. గురువారం రాత్రి విడుదలైన ఈ టీజర్‌ను ఇప్పటివరకూ యూట్యూబ్‌లో 30 లక్షలమంది వరకూ చూడడం విశేషం.