రేష్మి కథానాయికగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి.సినీస్టుడియో పతాకంపై ‘జబర్దస్త్’ ఫేమ్ రేష్మి కథానాయికగా ఓ చిత్రం ప్రారంభమైంది. దివాకర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు దివాకర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథా కథనాలతో ఆకట్టుకునే హారర్ సినిమాగా రూపొందిస్తున్నామని, రేష్మి ఈ పాత్రలో వంద శాతం న్యాయం చేయగలదని నమ్మకంతో ఆమెను ఎంపిక చేసామని, రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి జనవరి నెలాఖరుకు పూర్తి చేస్తామని తెలిపారు. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందే ఈ చిత్రం యువతనే కాక కుటుంబ ప్రేక్షకులను కూడా అలరిస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో బి.గోపాల్, అలీ, వి.లీనా, జె.ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఆనందబాబు, వైజాగ్ ప్రసాద్, పూర్ణిమ, కాశీ విశ్వనాధ్, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా-జె.ప్రభాకరరెడ్డి, మాటలు-కాశీవిశ్వనాధ్, కథ-ప్రసాద్ వనపల్లె, సమర్పణ-బాలాజీ నాగలింగం, నిర్మాత-వి.లీనా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం-డి.దివాకర్