హృదయం ఊగిసలాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పావని రావంత్, సాగర్ రావంత్, పావని జంటగా ధనుంజయ్ దర్శకత్వంలో కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై పళ్లా రమణయాదవ్ నిర్మిస్తున్న ‘నా హృదయం ఊగిసలాడే’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ దర్శకుడు సాగర్ క్లాప్‌నివ్వగా, రమేష్ యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఆర్.పి.పట్నాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు ధనుంజయ్ మాట్లాడుతూ, అయిదుగురు కుర్రాళ్ల కథ ఇది. ఇందులో హీరోయిన్ మెమెరీ లాస్ అవుతుందని, మిగిలిన నలుగురు కుర్రాళ్లు తమ స్నేహితుడిని, హీరోయిన్‌ను ఎలా కలిపారన్న అంశంతో తెరకెక్కుతున్న సినిమా ఆద్యంతం వినోదభరితంగా వుంటుందన్నారు. జనవరి 1 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్‌లో పూర్తిచేస్తామని అన్నారు. నిర్మాత రమణయాదవ్ మాట్లాడుతూ, వైజాగ్, అరకు, బాపట్ల వంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతామని, అందరూ కొత్తవాళ్ళతో తెరకెక్కుతున్న చిత్రమిది అన్నారు.