కొన్ని సినిమాలతోనే గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని, సురభి, నివేదా థామస్ ముఖ్యపాత్రల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘జెంటిల్‌మన్’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ ‘సినిమాలతో జయాపజయాలు వస్తాయి. కాని కొన్ని సినిమాలతో మాత్రమే గౌరవం వస్తుంది. ఈ సినిమాతో నాకు అదే లభించింది. జెండాపై కపిరాజు సినిమాలో రెండు పాత్రల్లో నటించాను. ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ సినిమాలో కూడా రెండు పాత్రల్లో చేశాను. నాకు డబుల్ సక్సెస్ దక్కింది. మోహన్‌గారు కథ చెప్పినపుడు చాలా ఎగ్జైట్ అయ్యా. థ్రిల్లర్ సినిమాలకు ఎడిటింగ్ చాలా ముఖ్యం. ఈ సినిమాకు పనిచేసిన ప్రతిఒక్కరూ ఎంతో సపోర్టు చేశారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చినపుడు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఎలా గెటిన్ అవుతాను అనుకున్నాను. కానీ ప్రేక్షకుల సపోర్టు వుంటే చాలు, ఏ బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదని నిరూపించారు’ అన్నారు. దర్శకుడు మోహనకృష్ణ మాట్లాడుతూ ‘నా సినిమాలు సంసార పక్షంగానూ, సెన్సార్ పక్షంగానూ వుంటాయని అంటారు. అందుకే ఈ సినిమాకు యు సర్ట్ఫికెట్ లభించింది. జయాపజయాలకు అతీతంగా కృష్ణప్రసాద్ ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. సినిమాకు మొదటి హీరో రచయితే. అద్భుతమైన స్టోరీ ఇచ్చారు. 2008లో నానితో ‘అష్టాచమ్మ’ చేశాను. ఆ సినిమాతో అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో తన పాత్రకు డబుల్ న్యాయం చేశాడు’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సురభి, నివేదా, అవసరాల శ్రీనివాస్, నిర్మాత కృష్ణప్రసాద్, వెనె్నల కిశోర్ తదితరులు తమ అభినందనలు తెలియజేశారు.