థ్రిల్లర్‌గా అరకు రోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌శంకర్, నికిషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అరకు రోడ్‌లో’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, థ్రిల్లర్ కథాంశంతో అరకు రోడ్‌లో ఏం జరుగుతుంది అన్న కథనంతో ఈ చిత్రం ఉత్కంఠభరితంగా సాగుతుందని, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. దర్శకుడు ప్రతి విషయంలో కేర్ తీసుకుని సినిమా రూపొందించారని, అతను మంచి విజన్ వున్న వ్యక్తి అన్నారు. థ్రిల్లర్ కథనంతో సాగే ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం సరికొత్తగా వుంటుందని, కొత్త దర్శకుడు అయినాకానీ యూనిట్ సహకారంతో ఈ చిత్రాన్ని అందరికీ నచ్చేలా రూపొందిస్తున్నామని దర్శకుడు వాసుదేవ్ తెలిపారు. రామ్‌శంకర్ కెరీర్‌లో ఓ హిట్ చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని, వాసుదేవ్ చెప్పిన కథ అందరికీ నచ్చడంతో ఈ సినిమాను కమర్షియల్ అంశాలతో మేళవించి రూపొందించామని, ఒకవైపు షూటింగ్ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని కథానాయకుడు రామ్‌శంకర్ అన్నారు.