20న అక్కినేని పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటుడు అక్కినేని నాగేశ్వర్‌రావు పేరుపై వివిధ రంగాల్లోని ప్రముఖులకు అంతర్జాతీయ పురస్కారాలు అందిస్తున్నామని అన్నారు అక్కినేని ఫౌండేషన్ అధ్యక్షులు తోటకూర ప్రసాద్. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈనెల 20న హైదరాబాద్‌లో ద్వితీయ అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలను ప్రదానం చేయనున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య హాజరుకానున్నారని తెలిపారు. అట్టడుగు స్థాయినుంచి శిఖరాగ్రానికి ఎదిగిన అక్కినేని జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, ఆయన తెలుగు పరిశ్రమకు విశేషమైన కృషిచేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో రవి కొండబోలు, దామా భక్తవత్సలం, వంశీ రామరాజు, శారద పాల్గొన్నారు.