దిగ్బంధన పాటలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రవీణ్, వంశీ, రమేష్, శ్రావణి, గాయత్రి, నాగినీడు ముఖ్యపాత్రల్లో డి. శ్రీనివాస్ దర్శకత్వంలో ది విజన్ పతాకంపై యాగ్ణిక పీఠం సమర్పణలో రూపొందిన దిగ్బంధన చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అహోబిలం రామానుజ చిన జీయర్‌స్వామి సీడీలను విడుదల చేశాక మాట్లాడుతూ, ‘యువత దశ దిశ ఏమిటో తెలిపే విధంగా ఈ చిత్రం రూపొందింది. ఇదివరకే దర్శకుడు శ్రీనివాస్ దేవాలయాలపై చిత్రీకరించిన షార్ట్ఫిలిమ్ మంచి గుర్తింపు తెచ్చుకుని జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంది. ఈ సినిమాను మంచి సందేశంతో, ఎక్కడా అసభ్యతకు తావులేకుండా తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ సినిమాకు మాటలే ముత్యాలుగా ఉంటాయి. ఈ సినిమా నచ్చుతుంది’ అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, దిగ్బంధన అనే పేరు పెట్టడానికి కారణం నేడు సమాజంలో మనుషులు చేయకూడని పనులన్నీ చేస్తున్నారని, అందుకే ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చిందన్నారు. చిన్న వయసులోనే బరువైన పాత్రను పోషించిన ప్రవీణ్ చాలా గొప్పగా చేశాడని, కొత్తదనాన్ని ఆదరించే ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని, చిత్రాన్ని జూలై 1న విడుదల చేస్తామని ఆయన వివరించారు.