అందరికీ నచ్చే బ్రాహ్మణ .... దాసరి నారాయణరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు ఉపేంద్ర హీరోగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో ‘శివం’ పేరుతో కన్నడంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రాన్ని ‘బ్రాహ్మణ’ పేరుతో విజి చరిష్ విజన్స్ మరియు శ్రీ తారకరామా పిక్చర్స్ పతాకాలపై విజయ్ ఎం, గుర్రం మహేష్‌చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ వున్న నటుడు ఉపేంద్ర. ఈ సినిమా కన్నడంలో పెద్ద విజయం సాధించింది. తెలుగులో కూడా అలాంటి విజయానే్న అందుకుంటుంది. మణిశర్మ మంచి మ్యూజిక్ ఇచ్చాడు’ అని అన్నారు. దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ, దాసరికి పెద్ద అభిమానినని, ఆయన చేసిన సినిమాలన్నీ మాలాంటి దర్శకులకు పాఠ్యపుస్తకాల్లాంటివని, అలాంటి గొప్ప దర్శకుడు ఈ సినిమా ఆడియో విడుదల చేయడం ఆనందంగా వుందన్నారు. ‘బ్రాహ్మణ’ చిత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అన్నారు. ఈ చిత్రంలో సలోని, రాగిణి ద్వివేది హీరోయిన్లుగా నటిస్తున్నారు.