చిన్న సినిమాలో విషయం వుండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న మారుతి మరోవైపు తన సొంత బ్యానర్‌లో చిన్న సినిమాల నిర్మాణాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కథతో తెరకెక్కిన చిత్రం ‘రోజులుమారాయి’. మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు మారుతి సమర్పణలో గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం జూలై 1న విడుదలౌతున్న సందర్భంగా మారుతి చెప్పిన విశేషాలు..‘ఈమధ్యే పేపర్‌లో వచ్చిన ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు వచ్చిన ఐడియా ఇది. దాని చుట్టూ అల్లుకున్న కథే ఈ సినిమా. దానికి థ్రిల్లింగ్ ఎలిమెంట్ జోడించి, ఎంటర్‌టైన్‌మెంట్ వేలో చెప్పాను. ఒక అబ్బాయిని అమ్మాయిలు కలిసి చంపేశారని ఆ ఆర్టికల్‌లో వచ్చింది. దాన్ని ఎలా చెప్పామనేదే సినిమా. కథ నాదైనా దర్శకుడు, రచయిత కలసి డెవలప్ చేసుకున్నారు. చిన్న సినిమాలు తీస్తున్నప్పుడు కచ్చితంగా అందులో ఏదో ప్రాముఖ్యం ఉండాలి. లేదంటే ఆ సినిమాని జనాలు అంగీకరించరు. ఇప్పుడు ప్రతివారం ఐదారు చిన్న సినిమాలు విడుదలవుతూ ఎవరూ పట్టించుకోక డస్ట్‌బిన్‌లో పడుతున్నాయి. అలా కాకుండా ప్రతి సినిమాలో అట్రాక్ట్ చేసే అంశం ఉండాలి. ఈ కథ అనుకున్న తర్వాత ఓసారి దిల్‌రాజుగారిని కలిశాను. కథ విన్న ఆయన బావుంది. నేను కూడా మీతో కలుస్తానని, ఈ సినిమాలో అసోసియేట్ అయ్యారు. దిల్‌రాజు బ్రాండ్‌తో సినిమా విడుదలైనా అందులో విషయం లేకపోతే ఎవరూ ఆదరించరు. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఈరోజుల్లో ప్రేమ ప్రాముఖ్యత తగ్గిపోయింది. బట్టలు ఎంపిక చేసుకున్నంత ఈజీగా ప్రేమను మారుస్తున్నారు. ప్రేమ అలా కాకూడదని చెప్పాం. ఇక నేను దర్శకత్వం వహిస్తున్న ‘బాబు బంగారం’ చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. వెంకటేష్‌ని డైరెక్ట్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన్ను చిన్నప్పటినుంచి చూస్తూ పెరిగాం. ఆయన ఎలాంటి పాత్రలో నటిస్తే బావుంటుందో అలాంటి పాత్రలో కనిపిస్తారు’ అని అన్నారు.