సురేందర్ దర్శకత్వంలో నితిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన ‘అ ఆ’ సినిమా సంచలన విజయం సాధించి, మంచి కమర్షియల్ విజయాన్ని అందించింది హీరో నితిన్‌కి. ఈ సినిమాతో 50 కోట్ల క్లబ్‌లో చేరిపోయారు నితిన్. ఫీల్‌గుడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తర్వాత నితిన్‌కు అవకాశాల వెల్లువ ప్రారంభమైంది. ఈ విజయంతో జోరుమీదున్న నితిన్ స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది. ఓవైపు పలువురు నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి సిద్ధవౌతుండగా మరోవైపు నితిన్ సొంత బ్యానర్‌లో సినిమాలు చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. నితిన్ సొంత బ్యానర్‌లో తెరకెక్కే ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తాడని తెలిసింది. ఇప్పటికే ఆయనతో చర్చలు కూడా జరిగాయని సమాచారం.