భాగ్యనగరంలో యూరో ఫిలిమ్ ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాగ్యనగర వాసులకు కనువిందు చేయడానికి యూరోపియన్ యూనియన్ (ఇయూ) సభ్య దేశాల ఆధ్వర్యంలో ఫిలిమ్ ఫెస్టివల్ జూలై 1నుండి జరగనుంది. ఈ ఫిలిమ్ ఫెస్టివల్‌లో 23 అవార్డు పొందిన సినిమాలను ప్రదర్శించనున్నారు. అమీర్‌పేట సారథి స్టూడియోలో నెదర్లాండ్స్ నుండి వచ్చిన (మిఖైల్ డెర్యూటర్) చిత్ర ప్రదర్శనతో ఒకటో తేదీ సాయంత్రం ఆరు గంటలకు తెలంగాణా ప్రభుత్వ ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్ జ్యోతి వెలిగించి, ఫిలిమ్ ఫెస్టివల్‌ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రియా, బెల్జియం, సైప్రస్, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగేరీ, ఐర్లాండ్, ఇటలీ, లాథ్వియా, లిథువేనియా, లగ్జంబర్గ్, మాల్టా, పోర్చుగల్, స్లోవేకియా, స్లావేనియా, స్పెయిన్, స్వీడన్, ది నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్‌డమ్ నుండి వచ్చిన చిత్రాలను ప్రదర్శిస్తారు. ఫిలిమ్ ఫెస్టివల్‌లో భారత్ వచ్చిన ఇయు రాయబారి థామస్ కోజ్లొవిస్కీ మాట్లాడుతూ.. మంచి సినిమాలు విశ్వజనీన అభ్యర్థనకు మారుపేరుగా నిలుస్తాయన్నారు. జూలై 1నుండి 10వ తేదీవరకు హైదరాబాద్‌తోపాటు 11 నగరాల్లో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు.