సైమాలో ‘బాహుబలి.. శ్రీమంతుడి హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సింగళి భాషలలో వేల పాటలను ఆలపించిన ఎస్.జానకికి సైమా అవార్డుల ప్రదానోత్సవంలో జీవితకాల పురస్కారాన్ని అందించారు. గత ఏడాది విడుదలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషా రంగాలకు సంబంధించిన చిత్రాలకు ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం అందించే సైమా అవార్డుల వేడుక ఈసారి సింగపూర్‌లో నిర్వహించారు. ఈ అవార్డుల ఉత్సవంలో ‘బాహుబలి’ చిత్రం మరోసారి తన బలాన్ని చూపి ఎక్కువ అవార్డులను కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ‘బాహుబలి’ చిత్రం ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. అదే విధంగా ఓ మంచి ఆశయంతో రూపొందిన మహేష్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రంలో నటించినందుకు ఆయనకు ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ఈసారి సైమా అవార్డ్స్‌లో బాహుబలి, శ్రీమంతుడు చిత్రాలు పోటాపోటీగా నిలిచాయి.

ఉత్తమ చిత్రం : బాహుబలి
దర్శకుడు : ఎస్.ఎస్.రాజవౌళి (బాహుబలి)
ఉత్తమ నటుడు : మహేష్‌బాబు (శ్రీమంతుడు)
నటి : శ్రుతిహాసన్ (శ్రీమంతుడు)
ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్రప్రసాద్ (శ్రీమంతుడు)
సహాయ నటి : రమ్యకృష్ణ (బాహుబలి)
ప్రతి నాయకుడు : రానా దగ్గుబాటి (బాహుబలి)
హాస్య నటుడు : వెనె్నల కిషోర్
(్భలే భలే మగాడివోయ్)
ఉత్తమ నటుడు (తొలి పరిచయం) : అక్కినేని అఖిల్ (అఖిల్)
ఉత్తమ నటి (తొలి పరిచయం) : ప్రగ్యాజైస్వాల్ (కంచె)
ఉత్తమ నిర్మాత (తొలి పరిచయం) : విజయ్‌రెడ్డి, శశిదేవ్‌రెడ్డి
(్భలే భలే మగాడివోయ్)
ఉత్తమ తొలి దర్శకుడు : అనిల్ రావిపూడి (పటాస్)
సంగీత దర్శకుడు : దేవిశ్రీప్రసాద్ (శ్రీమంతుడు)
గాయకుడు : సాగర్
(జత కలిసె - శ్రీమంతుడు)
గాయని : సత్యయామిని
(మమతల తల్లి- బాహుబలి)
గీత రచయిత : సిరివెనె్నల (కంచె)
ఉత్తమ కెమెరామెన్ : సెంథిల్‌కుమార్ (బాహుబలి)
ఉత్తమ నటి (జ్యూరీ) : అనుష్కశెట్టి (రుద్రమదేవి)
ఉత్తమ నటుడు (జ్యూరీ) : అల్లు అర్జున్ (రుద్రమదేవి)
యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియా : సమంత

***
చిత్రాలు..
సింగపూర్‌లో జరుగుతున్నసైమా అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన నటీనటులు
సైమా రెడ్ కార్పెట్‌పై సమంత