గోపీచంద్‌తో సంపత్ నంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రచ్చ’ సినిమాతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న దర్శకుడు సంపత్‌నంది ఆ తర్వాత పవన్‌కళ్యాణ్ నటించిన ‘గబ్బర్‌సింగ్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందే ‘గబ్బర్‌సింగ్-2’కోసం పవన్‌కళ్యాణ్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. చాలాకాలం సినిమాకోసం వెయిట్ చేసిన సంపత్‌నంది ఆ సినిమా కాదనుకుని రవితేజతో ‘బెంగాల్ టైగర్’ చిత్రా న్ని తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇప్పుడు మళ్లీ మెగా హీరోలతో సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు. అది కుదరకపోవడంతో తాజాగా గోపీచంద్‌కు కథ చెప్పి ఒప్పించాడని తెలిసింది. ఇటీవల వీరిద్దరి మధ్య చర్చ లు జరిగాయని సమాచారం. ప్రస్తుతం గోపీచంద్ ‘ఆక్సిజన్’ చిత్రం లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటిస్తాడు. ఈ సినిమా తర్వాత సంపత్‌నంది చిత్రం సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు ఉన్నా యి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది.