బిగ్ జెయింట్‌కు జగపతిబాబు డబ్బింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాలీవుడ్‌లో అద్భుత చిత్రాల సృష్టికర్త స్టీవెన్స్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో వస్తున్న మరో అద్భుత చిత్రం ‘ది బిగ్ ఫ్రెండ్లీ జెయింట్’ (ది బి ఎఫ్ జి). డిస్నీ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందించిన ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా ఈనెల 15న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రకు నటుడు జగపతిబాబు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పడం జగపతిబాబుకు ఇదే తొలిసారి. ఓ ఫ్రెండ్లీ మహాకాయుడికి ఒక చిన్నపిల్లకు మధ్య జరిగే అద్భుతమైన కథతో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ బడ్జెట్, ఆశ్చర్యపరిచే గ్రాఫిక్స్, ఆకట్టుకునే కథనం ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయని రిలయన్స్ అధికార ప్రతినిధి వివరించారు.