పెళ్లికళ వచ్చేసిందే బాలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో చాలాకాలం పాటు క్రేజీ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన గోవా బ్యూటీ ఇలియానాకు బాలీవుడ్‌పై హీరోయిన్‌గా వెలగాలనే ఆశ కలిగింది. దాంతో ఇక్కడ అవకాశాలను కాదనుకుని బాలీవుడ్‌కు చెక్కేసింది. బాలీవుడ్‌లో వచ్చిన రెండు మూడు సినిమాలు ఈమె కెరీర్‌కు పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతోపాటు చేతిలో పెద్దగా అవకాశాలు లేవు. మళ్లీ సౌత్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేసిన ఇలియానా ప్రస్తుతం అక్షయ్‌కుమార్ సరసన ‘రుస్తుం’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాపైనే చాలా ఆశలు పెట్టుకుంది. మరోవైపు సౌత్ నుండి అవకాశాలు వస్తున్నా కూడా కాదని చెబుతోందట. దానికి కారణం ఆమె ప్రియుడు ఆండ్రూ అని తెలిసింది. కొన్ని రోజులుగా ఆండ్రూతో ఇలియానా ఘాటు ప్రేమాయణంలో ఉంది. రుస్తుం సినిమా తర్వాత పెళ్లిచేసుకోవాలని ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే వచ్చిన అవకాశాలను కాదంటోంది. మొత్తానికి ఇలియానా త్వరలోనే సినిమాలకు పులిస్టాప్ పెట్టి, పెళ్లికి సిద్ధవౌతోందని సమాచారం.