పల్లెకుపోదాం పాట రీమిక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా రూపొందిన దేవదాసు చిత్రంలో ‘పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో’ అనేది ఎవర్‌గ్రీన్ సాంగ్. ఈపాట ఇప్పుడు రీమిక్స్‌గా ‘ఆటాడుకుందాం రా’ చిత్రంలో వినిపించబోతోంది. సుశాంత్ కథానాయకుడిగా అన్నపూర్ణా స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్, శ్రీ జీ ఫిలింస్ పతాకాలపై జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం రా’ (జస్ట్ చిల్). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పాటలు మినహా పూర్తయింది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘పల్లెకు పోదాం పారును చూద్దాం’ పాటను రీమిక్స్ చేశారు. ఈ పాటను నాలుగు రోజులపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ఎవర్‌గ్రీన్ పాట పల్లెకు పోదాం పారును చూద్దాం ఈ సినిమాలో రీమిక్స్ చేయడం ఆనందంగా వుందని, మిగిలిన నాలుగు పాటలు విదేశాల్లో చిత్రీకరించనున్నామని అన్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించామని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్రంలో దేవదాసు పాటను రీమిక్స్ చేయడం, ఆ పాటలో నేను నటించడం ఆనందంగా వుందని, ఇదో అదృష్టంగా భావిస్తున్నానని, ఈ పాట సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని కథానాయకుడు సుశాంత్ అన్నారు. తండ్రీకొడుకులమధ్య ఎమోషన్స్ ప్రతిఒక్కరికీ నచ్చుతాయని, సెంటిమెంట్ ఎమోషన్‌తోపాటుగా థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా సినిమాలో వున్నాయని దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు.