అదిరేటి స్టెప్పు నువ్వేస్తే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో టాప్ హీరోయిన్ల రేసులో ఉన్న తమన్నాకు ఈమధ్య క్రేజీ సినిమా అవకాశాలు అందివస్తున్నాయి. ఇటీవలే ‘ఊపిరి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తమన్నా ప్రస్తుతం ‘అభినేత్రి’ అనే భారీ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ సినిమాతో తన సత్తా చాటుకోవాలనే గట్టి ప్రయత్నాల్లో ఉంది మిల్క్భీమ. అందుకే ఈ సినిమాకోసం తెగ కష్టపడుతోందట. ఇందులో కావాల్సినంత గ్లామర్ అందాల్ని ఆరబోయడమే కాకుండా నటిగా తనదైన సత్తాను ప్రూవ్ చేసుకోనుందట. మరోవైపు డాన్సులో కూడా ఇరగదీస్తుందట! ప్రభుదేవా సరసన నటిస్తున్న ఈమె ప్రభుదేవాకు డాన్సుల్లో గట్టి పోటీ ఇస్తోందట. దాంతో తమన్నా టాలెంట్‌కు ప్రభుదేవా షాకయ్యాడు. మొత్తానికి ‘అభినేత్రి’ సినిమాతో తమన్నా మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని అంటున్నారు సినీ జనాలు.

చిత్రం.. తమన్నా