ముగ్గురు కొత్తహీరోల జిందగీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిరణ్, వర్ధన్, ఫణిప్రకాష్ ప్రధాన తారాగణంగా దయా పిక్చర్స్, శ్రీనాథ్ ఫ్రెండ్స్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘జిందగీ’. కె.దయాకర్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో వి.చంద్రశేఖర్‌తో కలసి ఈ సినిమా నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఆదివారం ఉదయం జరిగింది. స్థానిక నాయకుడు నారాయణస్వామి ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు దయా మాట్లాడుతూ, కళాశాల ముగిశాక విద్యార్థులుగా ఉన్న ముగ్గురు మిత్రులు తమ జీవితాన్ని ప్రారంభించి ఏమేమి సాధించారు, వారి జీవితంలో మలుపుతిరిగిన అవకాశాలు ఎలా వచ్చాయి, వాటిని ఎలా వినియోగించుకుని సమాజానికి మేలు చేశారు? అనే కథనంతో ఈ చిత్రం రూపొందిందని తెలిపారు. ముగ్గురు హీరోలు కొత్తవాళ్లు అయినా బాగా నటించారని, పాటలు సందర్భానుసారంగా వస్తాయని తెలిపారు. సినిమా షూటింగ్ పూర్తిచేసి, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నామని, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని విశేషాలను తెలిపారు. హిమజ, వినయ్, పరమ్, సంతోషి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఉదయ్ గుర్రాల, సంగీతం: సురేష్ యువన్, ఎడిటింగ్: అనిల్ ఆలయం, నిర్మాతలు: దయాకర్‌రెడ్డి, వి.చంద్రశేఖర్, రచన, దర్శకత్వం: దయా.