అవసరానికో అబద్ధం ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన తారలతో చక్రం క్రియేషన్స్ పతాకంపై సురేష్ కె.వి. దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అవసరానికో అబద్ధం’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు త్రివిక్రమ్ ట్రైలర్ విడుదల చేసి వౌత్ పబ్లిసిటీతో ఈ సినిమా విజయవంతం కావాలని, తాము రూపొందించిన ‘స్వయంవరం’ చిత్రం కూడా అలాగే హిట్ అయిందని అన్నారు. నిజమని నువ్వు నమ్మేదానిని, నిజమని నీకు చెప్పింది ఎవరు? అబద్ధమని నువ్వు అనుకునేదాన్ని అబద్ధమని నీకు చెప్పింది ఎవరు? అనే ఆలోచనకు ప్రతిరూపంగా ఈ సినిమాను థ్రిల్లర్ జోనర్‌గా తెరకెక్కించామని, అవసరం మనిషికి అందించే అతి శక్తివంతమైన ఆయుధం అయిన అబద్ధం చుట్టూ అల్లుకున్న కథే ఇదని చిత్ర దర్శకుడు సురేష్ కె.వి. అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. లోకేష్, రాజేష్, శశాంక్, గీతాంజలి, సందీప్, వెంకి, ఎం.జి.ఆర్, గిరిధర్, మురళి, విజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వెంకటరమణ ఎస్, సంగీతం: సాయికార్తీక్, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, నిర్మాతలు: విజయ్ జె, పులి శ్రీకాంత్, సందీప్, రచన, దర్శకత్వం: సురేష్ కె.వి.