చుట్టాలబ్బాయి వస్తున్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది, నమితాప్రమోద్ జంటగా వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, ఎస్.ఆర్.టి. మూవీ హౌస్ పతాకాలపై వెంకట్ తలారి, రాము తాళ్లూరి సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా రీరికార్డింగ్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ఈ సినిమాను తీర్చిదిద్దారని, ఆది నటన సినిమాకు హైలెట్‌గా ఉంటుందని తెలిపారు.
ఒక పాట మినహా మొత్తం పూర్తిచేశామని, థమన్ అందించిన ఆడియోను ఈనెల 16న భారీ ఎత్తున విడుదల చేయనున్నామని, అలాగే సినిమాను కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతున్నామని వారు తెలిపారు. కుటుంబమంతా కలసి చూసి ఆనందించేలా రూపొందిన ఈ చిత్రానికి థమన్ మంచి సంగీతం అందించారని, పాటలు సినిమాకు హైలెట్ అవుతాయని, తనకు, ఆదికి మరో సూపర్‌హిట్ చిత్రంగా చుట్టాలబ్బాయి నిలుస్తాడని దర్శకుడు వీరభద్రమ్ అన్నారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణ్భగవాన్, అభిమన్యుసింగ్, జీవా, సురేఖావాణి, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, రచ్చరవి, గిరిధర్, అనితానాథ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎస్.అరుణ్‌కుమార్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, మాటలు: భవానీప్రసాద్, సంగీతం: ఎస్.ఎస్.్థమన్, నిర్మాతలు: వెంకట్ తలారి, రాము తాళ్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్.