రామ్ సినిమాల జోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను శైలజ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ తన తదుపరి చిత్రాలకు జోరు పెంచాడు. ప్రస్తుతం ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించనున్నాడు. ‘పటాస్’, ‘సుప్రీమ్’ల విజయంతో మంచి ఫామ్‌లోకి వచ్చిన అనీల్ రావిపూడి రామ్ కోసం మంచి కథ రెడీ చేశాడట. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది. తనకి చాలా గ్యాప్ తర్వాత మంచి హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడు. ఆ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్‌పైకి రానుంది. దాంతోపాటు ప్రేమకథా చిత్రాల దర్శకుడు కరుణాకరన్‌తో కూడా ఓ చిత్రం చేస్తాడని తెలిసింది. మొత్తానికి ఈ ఏడాదితోపాటు వచ్చే ఏడాది ప్రథమార్థం వరకూ డైరీ ఖాళీ లేదు.