విశాల్‌కు జతగా మంజిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో మలయాళ తారల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో మంజిమా మోహన్ తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుండగా, అప్పుడే మంజిమా మరో క్రేజీ ప్రాజెక్టును సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. విశాల్ కథానాయకుడుగా నటించబోయే ‘పందెంకోడి-2’ చిత్రంలో మంజిమామోహన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ‘పందెంకోడి’ చిత్రానికి సీక్వెల్‌గా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంతోపాటుగా మరికొన్ని చిత్రాల్లో మంజిమాకు అవకాశాలు వరిస్తున్నాయట! తెలుగులో ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే పలువురు యువ హీరోల సరసన నటించడానికి ఆమెను దర్శక, నిర్మాతలు సంప్రదిస్తున్నారు. సినిమా విడుదలయ్యాక ఇంకెంత క్రేజ్ పెరుగుతుందో చూడాలి!