స్వచ్ఛమైన ప్రేమకథ..మరల తెలుపనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రిన్స్, వ్యోమనంది, పూజా రామచంద్రన్‌లు హీరో హీరోయిన్లుగా శ్రీ చైత్ర చలన చిత్ర నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మరల తెలుపనా ప్రియా’. ఈ చిత్రం ద్వారా వాణి.యం.కొసరాజు దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోందంటూ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ, మరల తెలుపనా ప్రియా పాటలను ప్రేక్షకులు బాగా ఆదరించారని, ఎలాంటి సంగీతం కావాలో దాన్ని డైరక్టర్ రాబట్టుకున్నారని, ప్రతి పాటకు మంచి సాహిత్యం కుదిరిందని అన్నారు. దర్శకురాలు స్వయంగా రాసిన ఓ పాట బాగా వచ్చిందని, అన్నివర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని అన్నారు. దర్శకురాలు వాణి యం.కొసరాజు మాట్లాడుతూ, ఇది స్వచ్ఛమైన ప్రేమకథ అని, శేఖర్ చంద్ర అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారని, లిరిక్ రైటర్స్ చక్కని సాహిత్యాన్ని అందించారని అన్నారు. భిన్నమైన వ్యక్తిత్వాలు, నేపథ్యాలున్న అమ్మాయి, అబ్బాయిలమధ్య సాగే ప్రేమకథ ఇదని, ఇప్పుడు అమ్మాయిలు కూడా ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్నారని, స్ర్తి అయినా తనకు ఆ ధోరణి నచ్చలేదని, స్ర్తి పురుషులెవరైనా ప్రేమ స్వచ్ఛంగానే ఉండాలని, అదే విషయాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నానని అన్నారు.
నెలాఖరున సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:శేఖర్ చంద్ర, ఆర్ట్:పి.ఎస్.వర్మ, ఫైట్స్:సతీష్, కెమెరా:ఎస్.రాజశేఖర్, ఎడిటర్:మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్:కె.సురేష్‌బాబు, శ్రీనివాస్ వుడిగ, నిర్మాణం:శ్రీ చైత్ర చలన చిత్ర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వాణి ఎం.కొసరాజు.