సినిమా అంటే గ్లామరే కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సినిమాలో నటించడం అంటే కేవలం గ్లామర్‌ను చూపించడమే కాదు. మనకు ఏ పాత్రలు సూట్ అవుతాయో వాటిని ఎంచుకుని నటించాలి. ఆ విషయంలో నేను పూర్తి విశ్వాసంతో వుంటాను’ అని నటి సురభి తెలిపారు. నాని కథానాయకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ‘జెంటిల్‌మన్’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికలుగా సురభి, నివేదా థామస్ నటించారు. సురభిని చిత్ర విశేషాలు గూర్చి చెప్పమంటే ఇలా చెప్పారు..
నాని రికమెండ్ చేస్తేనే...
తమిళంలో నటించిన ‘వేళఇల్లాద పట్టదారి’ సినిమా తెలుగులో ‘రఘువరన్ బి.టెక్’గా విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైంది. ఆ చిత్రంలో నటించిన నన్ను చూసి నాని దర్శకుడికి సిఫారసు చేశాడు. ఆయనకు కూడా నా నటన నచ్చడంతో ‘జెంటిల్‌మన్’ చిత్రంలో ఎంపిక చేశారు. నానితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా వుండేది. ప్రతి విషయంలో సహకరించారు.
ఇద్దరికీ ప్రాధాన్యం
ఈ సినిమాలో నాతోపాటు మరో హీరోయిన్ నటిస్తోందని నాకు తెలియదు. తెలిసిన తరువాత కూడా దాని గురించి అంతగా ఆలోచించలేదు. మా ఇద్దరికీ సినిమాలో ప్రాధాన్యమున్న పాత్రలు వున్నాయి. నివేదా మంచి అమ్మాయి. ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. ఈ సినిమాలో మా ఇద్దరివీ డిఫరెంట్ పాత్రలే. ఒకదానితో ఒకటి పోల్చలేం.
చాలా కాన్ఫిడెంట్‌గా..
‘రఘువరన్ బి.టెక్’, ‘బీరువా’, ‘ఎక్స్‌ప్రెస్‌రాజా’, ‘జెంటిల్‌మన్’ లాంటి విజయాలు అందుకున్నాను. నా పాత్రల విషయంలో పూర్తి కాన్ఫిడెంట్‌గానే వుంటాను. తెలుగు పరిశ్రమ నన్ను ఎంతగానో ఆదరిస్తోంది. చిన్నప్పటినుండీ నటన అంటే ఇష్టం. పెయింటింగ్ కూడా చాలా ఇష్టం. పెయింటింగ్‌లో కోర్సు కూడా చేశాను. తరువాత సినిమా ప్రయత్నాలు చేసి తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చాను. అక్కడ రెండు మూడు చిత్రాలు చేశాక ఇక్కడ అవకాశాలు వచ్చాయి. సందీప్‌తో‘బీరువా’ సినిమా చేశాక, తమిళంలో మరో చిత్రం అతనితో చేయాలనుకున్నా కుదరలేదు.
గ్లామర్ + నటన
నేను కథ ఎన్నుకున్నపుడు నా పాత్ర, డైరెక్టర్‌ను దృష్టిలో పెట్టుకుని ఒప్పుకుంటాను. పూర్తిస్థాయి గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు అవకాశం వుండే పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. అయితే, నటించే పాత్రలో కూడా గ్లామర్ ఉండాలి.

-శ్రీ