హారర్ జోనర్‌లో మరోసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు కథానాయిక అంజలికి తమిళంలో ఎంతో క్రేజ్ వుంది. ఈమధ్య తెలుగులో కూడా మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఈ భామకు ఎ.ఆర్.మురగదాస్ తెరకెక్కించిన ‘జర్నీ’ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. కథానాయకుడు జై, అంజలికి ఆ చిత్రంతో మంచి పేరొచ్చింది. ఇపుడు ఈ ఇద్దరు కలిసి మరో చిత్రం కోసం జతకట్టారు. వారిద్దరి సినిమా నేడు సెట్స్‌పైకి వెళ్లింది. తమిళంలో కొద్దికాలంగా పాపులర్ అయిన రొమాంటిక్ హారర్ జోనర్‌లోనే ఈ చిత్రమూ తెరకెక్కుతోంది. సినీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో జై మళ్లీ ఐదేళ్ళ తర్వాత కలిసి అంజలితో నటిస్తున్నారు. కొద్దికాలంగా సరైన హిట్స్‌కోసం ఎదురుచూస్తున్న అంజలి ఈ సినిమాతో మరోసారి తెలుగు, తమిళ భాషల్లో తన స్టార్‌డమ్ తిరిగి పొందడానికి ప్రయత్నాలు చేస్తోంది.