జనవరి 1న నేను..శైలజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్, కీర్తి సురేష్ జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న చిత్రం ‘నేను శైలజ’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ఈనెల 21న ఆడియో విడుదల చేసుకోవడానికి సిద్ధమవుతున్న సందర్భంగా చిత్ర వివరాలను నిర్మాత స్రవంతి రవికిశోర్ తెలియజేశారు. ‘ఒక అబ్బాయి అమ్మాయి’ మధ్య జరిగే ప్రేమకథ ఇది. ఇంతకుముందు ఈ చిత్రానికి ‘హరికథ’ అనే టైటిల్‌ను అనుకున్నామని, కానీ, ‘నేను..శైలజ’ బాగుంటుందని ఈ టైటిల్‌ను ఓకె చేశామన్నారు. హీరో పాత్ర సాఫ్ట్‌గా వుంటూనే మాస్‌కు కనెక్ట్ అవుతుందని, కిశోర్ తిరుమల అద్భుతంగా తెరకెక్కించాడని, ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు హైలెట్‌గా నిలుస్తాయి. ఈనెల 21న పాటలని విడుదల చేసి జనవరి 1న చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. రామ్ మాట్లాడుతూ, చాలా రియలిస్టిక్‌గా వుండే పాత్ర ఇదన్నారు. ఇందులో డిజెగా కనిపిస్తానని, అన్ని వర్గాలవారికి నచ్చే విధంగా సినిమా వుంటుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్, కెమెరా:సమీర్‌రెడ్డి, పాటలు:సిరివెనె్నల, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, సమర్పణ:కృష్ణచైతన్య, నిర్మాత:స్రవంతి రవికిశోర్, దర్శకత్వం:కిశోర్ తిరుమల.