జడ్జి పాత్రలో లక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు లక్ష్మీప్రసన్న ముఖ్య పాత్రలో కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ పతాకంపై వేళ్ల వౌనిక చంద్రశేఖర్, ఉమ లక్ష్మీనరసింహ నిర్మిస్తున్న చిత్రం ‘లక్ష్మీబాంబ్’. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేశారు. ‘కామెడీ థ్రిల్లర్‌గా సరికొత్త కానె్సప్ట్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. మంచు లక్ష్మి జడ్జి పాత్రలో నటిస్తున్నారు. ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. దీపావళి టపాసుల్లో లక్ష్మీబాంబుది ఎంత పవరో ఈ సినిమాలో లక్ష్మి పాత్ర అంత పవర్‌ఫుల్. ఆగస్టు వరకు రెగ్యులర్ షూటింగ్ జరిపి సింగిల్ షెడ్యూల్‌లోనే చిత్రీకరణ పూర్తిచేస్తాం. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి, వీలైనంత త్వరగా చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: గుడిపాటి సురేష్‌రెడ్డి.