తోటి నటుల సినిమాలకు వాయిస్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా సినిమా రంగంలో హీరోల మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒక హీరోను మించి మరో హీరో భారీ వసూళ్లు సాధించాలని టాప్ హీరోగా ఎదగాలని ప్రయత్నం చేస్తుంటాడు. పర్సనల్‌గా పోటీ లేకున్నా కూడా ప్రొఫెషనల్‌గా గట్టి పోటీయే వుంటుంది. ఇక అభిమానుల్లో అయితే తమ హీరో గొప్పవాడంటే తమ హీరోనే గొప్పవాడంటూ నానా రభస చేయడం పరిపాటి. ఇప్పటివరకు గిరిగీసుకున్న హీరోలు ఇప్పుడు హద్దులను చెరిపేసే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో హీరోల మధ్య ఈ బౌండరీలు చెరిగిపోతున్నాయి. ఒక హీరోకోసం మరో హీరో అవసరమైన సపోర్ట్ అందిస్తూ ఆ సినిమా విజయంకోసం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది ఒక హీరో సినిమాకోసం మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం సంచలనంగా మారింది.
ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన ‘జల్సా’ సినిమాలో మహేష్ ఇచ్చిన వాయిస్ ఓవర్ చూసి ప్రేక్షకులు షాకయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మహేష్, పవన్‌ల మధ్య గట్టిపోటీ నెలకొంది. నెం.1 హీరోగా ఎవరు నిలుస్తారనే పోటీ మధ్య ఇలా మహేష్ పవన్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఓ రకంగా సంచలనమే! దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని సినిమా కూడా మంచి విజయాన్ని నమోదుచేసుకుంది. అంతేకాకుండా మహేష్ మరోసారి తన వాయిస్ ఓవర్‌ని ఎన్టీఆర్‌కోసం అందించాడు. ఎన్టీఆర్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాద్‌షా’ చిత్రంకోసం వాయిస్ ఓవర్ ఇచ్చాడు మహేష్. ఇక ఈ వాయిస్ ఓవర్‌ల పరంపర అప్పటినుంచి బాగానే కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ నటుడు చిరంజీవి కూడా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ సినిమాకోసం వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక రవితేజ కూడా వాయిస్ ఓవర్ అందించి ఆ సినిమా విజయంలో భాగం పంచుకున్నాడు. సునీల్ హీరోగా నటించిన ‘మర్యాదరామన్న’ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించడమే కాకుండా అందులో సైకిల్ పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పడం విశేషం. అంతేకాకుండా మంచు విష్ణు హీరోగా నటించిన ‘దూసుకెళ్తా’ సినిమాకోసం తన గాత్రాన్ని అందించాడు. ఇక యువ హీరో రామ్ కూడా ఓ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా పరిచయం అవుతూ వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో రూపొందిన ‘రేయ్’ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇక కమెడియన్ సునీల్ ‘బిందాస్’ చిత్రానికి తన వాయిస్ అందించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోలు ఇతర హీరోల సినిమాలకు గాత్రాన్ని అందిస్తూ ఆ హీరోల చిత్రాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

- శ్రీ