ఆగస్టు నుంచి రోబో-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న రోబో-2 చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యాడని, దాంతో సినిమా ఆగిపోయిందనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి తెర దింపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమా ఆగిపోలేదని, ఆగస్టు నుంచి తదుపరి షెడ్యూల్‌ని మొదలుపెడతామని లైకా ప్రొడక్షన్స్ అధినేతలు తెలిపారు. మరోవైపు శంకర్ ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ విషయంలో బిజీగా వున్నాడట. సాంకేతిక పరంగా ఉన్నత స్థాయిలో గ్రాఫిక్స్ ఈ చిత్రంలో ఉంటుందని తెలిపారు. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రోబో చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దానికి సీక్వెల్‌గా రూపొందే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తామని వారు తెలిపారు. మరోవైపు రజనీకాంత్ హీరోగా నటించిన కబాలి చిత్రం ఈనెల 22న విడుదలకు సిద్ధమైంది.