వడచెన్నయ్ వద్దంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో పాపులర్ హీరోయిన్‌గా మారిన సమంత వరుస సినిమాలతో తనదైన జోరుని ప్రదర్శిస్తోంది. అవకాశాలతోపాటు వరుస విజయాల్ని అందుకుంటున్న ఈమె నటిగా నిరూపించుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పూర్తి డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటించేందుకు ఓకే చెప్పింది. తమిళంలో రూపొందే ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నాడు. ‘వడచెన్నయ్’ పేరుతో తెరకెక్కే ఈ సినిమాలో నటిస్తున్నానని, ప్రీప్రొడక్షన్ పనులు కూడా పూర్తయి త్వరలోనే సెట్స్‌పైకి రానున్న ఈ సినిమాలో సమంత ఓ స్లమ్ యువతిగా కనిపించనుందట. ప్రస్తుతం ఈమె ఈ సినిమానుండి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో రెండు భారీ సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వడచెన్నయ్ సినిమానుండి సమంత తప్పుకోవడంతో ఇప్పుడాపాత్రకోసం అమలాపాల్‌ను సంప్రదిస్తున్నారట.