స్పెయిన్‌లో మిస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా హీరో వరుణ్‌తేజ్, శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ పేరుతో రూపొందే సినిమా కొద్దిరోజుల క్రితమే ప్రారంభమైన విషయం తెలిసిందే. ‘ఆగడు’, ‘బ్రూస్‌లీ’ సినిమాల ప్లాప్‌తో తన స్థాయిని మళ్లీ నిలుపుకోవాలన్న కసితో ఈ చిత్రాన్ని చేస్తున్నారు శ్రీనువైట్ల. ఇప్పటికే అన్ని కార్యక్రమాల్ని పూర్తిచేసుకున్న ఈ చిత్రం స్పెయిన్‌లో ఈవారంనుండే షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్ మొత్తం స్పెయిన్‌లోనే చేయనున్నారు. ఇప్పటికే ఈ టీమ్ స్పెయిన్‌ను చేరుకుంది. నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ సరసన లావణ్యాత్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతోపాటు వరుణ్‌తేజ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.