భాష.. యాస మర్చిపోకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సొంత భాష, యాసలను మర్చిపోకూడదని, మన సంప్రదాయాలను భావితరాలకు అందించాలంటే ఇవి అవసరమని హీరో పవన్‌కల్యాణ్ అన్నారు. యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా లండన్‌లోని త్రాక్సిలో నిర్వహించిన జయతే కూచిపూడి, జయతే బతుకమ్మ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళాకారులకు జ్ఞాపికలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కళ మనకు నూతన ఉత్తేజాన్నిస్తుందని, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉండాలి అని, కళ అనేది సంస్కృతిలో అంతర్భాగమని, మన భాషలో యాసని మర్చిపోకూడదని పేర్కొన్నారు. తన సినిమాల ద్వారా సాంప్రదాయాల్ని ప్రోత్సహిస్తానని, వివిధ తెలుగు ప్రాంతాల జానపద గీతాలు తన సినిమాల్లో ఉండేలా చూస్తానని ఆయన చెప్పారు. తెలుగు సంస్కృతి, కళలను భావితరాలకు అందంచే విధంగా ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.