నాయకి వస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిష ప్రధాన పాత్రలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై గోవి దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మాతలుగా రూపొందించిన ‘నాయకి’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 15న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత గిరిధర్ మాట్లాడుతూ, రెండవ చిత్రంగా తమ సంస్థలో త్రిష ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని తెలిపారు. దర్శకుడు కథ చెప్పినదానికన్నా తెరపై ఆవిష్కరించిన తీరు అందరికీ నచ్చుతుందని, ఫస్ట్ కాపీ చూసి చాలా సంతోషంగా ఉన్నామని ఆయన అన్నారు. తెలుగు, తమిళ భాషల్లో దర్శకుడిగా తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని, చిన్న సినిమాగా ప్రారంభించి ఈ సినిమా పెద్ద సినిమాగా మారిందని, అనుకున్న రీతిలోనే చిత్రాన్ని పూర్తిచేశామని దర్శకుడు గోవి తెలియజేశారు. రెగ్యులర్‌గా వచ్చే హారర్ చిత్రంలా కాకుండా రెట్రో హారర్ కామెడీ సినిమాగా అందరికీ నచ్చేలా సినిమా రూపొందిందని ఆయన తెలిపారు. తమ ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకున్నారు. కార్యక్రమంలో రఘు కుంచె, ఎన్.శంకర్, మల్కాపురం శివకుమార్, పద్మజ మామిడిపల్లి తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:రఘు కుంచె, నేపథ్య సంగీతం:సాయి కార్తీక్, కెమెరా:జగదీష్ చీకటి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గోవి.