హీరోగా యాంకర్ ప్రదీప్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెలివిజన్ రంగంలో తనదైన యాంకరింగ్‌తో ఆకట్టుకుంటున్న ప్రదీప్ అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మేల్ యాంకర్‌లలో ఒక్క ప్రదీప్‌కే మంచి క్రేజ్ వుంది. ఇక ఈ యాంకర్‌బాబు ఇప్పుడు హీరోగా మారుతున్నాడు. అవును ఈయన సోలో హీరోగా నటించే సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయి. తమిళంలో హిట్ అయిన ‘మందాసు పట్టి’ అనే సినిమా రీమేక్‌లో ఈయన నటిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా మహేష్ బావ సుధీర్‌తో ప్లాన్ చేశారు కాని సుధీర్ పక్కకు తప్పుకోవడంతో ఇప్పుడు ఆ అవకాశం ప్రదీప్‌కి దక్కింది. 1980 నేపథ్యంలో ఈ సినిమా వుంటుందని తెలిసింది. మొత్తానికి సినిమాల్లో హీరోగా వెలగాలని వచ్చిన ప్రదీప్‌కి ఇన్నాళ్ళకి తన కల నెరవేరే అవకాశం వచ్చిందన్నమాట. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.