చిన్న సినిమాలకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సై’, ‘ఆంధ్రావాలా’, ‘నా అల్లుడు’ వంటి చిత్రాలను రూపొందించిన నిర్మాత గిరి చిన్న సినిమాలకు తన సహకారాన్ని అందిస్తానని తెలియజేస్తున్నారు. వైనతేయ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై చిన్న సినిమాలు రూపొందించడానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ‘అర్థనారి’ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్మాత గిరి మాట్లాడుతూ, పరిశ్రమలో అనేకమంది చిన్న దర్శక నిర్మాతలు సినిమా విడుదల విషయంలో ఇబ్బందులు పడుతున్నారని, అలాంటివారికి వెన్నుదన్నుగా నిలవడానికి పక్కా ప్లాన్‌తో తాము ఈ సంస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరైనా మంచి కథతోపాటుగా 30 శాతం షేర్‌తో వస్తే, తాము 70 శాతం షేర్ కలిపి సినిమాలను తీసి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తామని, ‘అర్థనారి’ సినిమా దర్శకుడు భానుశంకర్ తమ కమిటీలో కథను ఫైనలైజ్ చేసే సభ్యులుగా వుంటారని ఆయన తెలిపారు. అలాగే, చిన్న సినిమాల శాటిలైట్ రైట్స్ కూడా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, దయచేసి చిన్న సినిమా నిర్మాతలను వారి అభిరుచులను ప్రోత్సహించి మంచి సినిమాలు తీయడానికి అవకాశం ఇవ్వవలసిందిగా పరిశ్రమలోని పెద్దలను తాము కోరుతున్నామని ఆయన తెలిపారు. క్వాలిటీతో సినిమాను రూపొందించి 500 కోట్ల టర్నోవర్‌తో చిత్ర నిర్మాణం చేయడానికి ముందుకు వచ్చామని మరో నిర్మాత సిరాజుద్దీన్ తెలిపారు. మంచి సినిమా తీసినా సరైన థియేటర్లు దొరకడంలేదని, అందుకే ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను నిర్మాత గిరి స్థాపించడం ఆనందదాయకమని దర్శకుడు భానుశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లావణ్యారెడ్డి, ప్రణయరెడ్డి, అర్థనారీ కథానాయకుడు అర్జున్ యజత్, కథానాయిక వౌర్యానీ తదితరులు పాల్గొన్నారు.