15న నినే్న కోరుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్, విజయభాస్కర్, ఆనంద్, పూజిత, సాగర్ ప్రధాన తారాగణంగా శుభకరి క్రియేషన్స్ పతాకంపై గణమురళి దర్శకత్వంలో మరిపి విద్యాసాగర్ రూపొందించిన చిత్రం ‘నినే్న కోరుకుంటా’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 15న విడుదలకు సిద్ధంచేశారు. ఈ సందర్భంగా నిర్మాత మరిపి విద్యాసాగర్ (వినయ్) మాట్లాడుతూ, రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం తొలి సన్నివేశం నుండి చివరి సన్నివేశం వరకూ నవ్విస్తూనే వుంటుందని, నేటి యువతీ యువకుల మనస్తత్వాలను అద్దంపట్టి చూపినట్టుగా దర్శకుడు సినిమా రూపొందించారని తెలిపారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఈ సినిమా కోసం దర్శకుడు చెప్పినదానికన్నా ఎక్కువగా కష్టపడి సినిమా రూపొందించారని ఆయన తెలిపారు. ఓ అందమైన కథకు స్క్రీన్‌ప్లే బేస్డ్ కథనాన్ని చేర్చి అందరినీ ఆకట్టుకునే ఎలిమెంట్స్‌తో రూపొందించిన ఈ చిత్రాన్ని ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ఆయన తెలిపారు. యువతకు ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు సందేశం కూడా అందించడానికి ఈ చిత్రంలో ప్రయత్నించామని, తమ ప్రయత్నం విజయవంతం అవుతుందన్న నమ్మకం వుందని దర్శకుడు గణ మురళి తెలిపారు. చమ్మక్ చంద్ర, సుమన్‌శెట్టి, వైజాగ్ ప్రసాద్, పూర్ణిమ, సత్యం రాజేష్, కొండవలస, సంజన, అంబటి శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు:రవికిరణ్, కులశేఖర్, సంగీతం:ప్రణవ్, ఎడిటింగ్:నందమూరి హరి, నిర్మాత:మరిపి విద్యాసాగర్ (వినయ్), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గణ మురళి.