సినిమాలకు గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాధ పెద్దకూతురు కార్తీక త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పబోతుందని సమాచారం, నాగచైతన్య హీరోగా పరిచయమైన ‘జోష్’ సినిమాతో కార్తీక కూడా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా తరువాత తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోవడంతో కార్తీక తమిళ చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు చేసింది. కె.వి.ఆనంద్ రూపొందించిన ‘రంగం’ సినిమాతో కార్తీక తెలుగు, తమిళ భాషల్లో విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత కార్తీకకు చెప్పుకోదగ్గ అవకాశాలు పలకరించలేదు. ఎన్టీఆర్‌తో చేసిన దమ్ము బోల్తా కొట్టడంతో తెలుగులో కన్పించకుండా పోయింది. తమిళంలోనూ ఇదే పరిస్థితి. ఇక మలయాళంలో కూడా పెద్దగా కలిసిరాలేదు. దాంతో కార్తీక సినిమాలకు గుడ్‌బై చెప్పేసి బుల్లితెరకు మాత్రమే పరిమితం కావాలనుకుంటోందట. అదీ హిందీ సీరియల్స్‌లో మాత్రమే కనిపించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కోలీవుడ్ టాక్.