200కోట్ల సినిమాకు నో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో రూపొందిన ‘బాహుబలి’ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొంది సంచలన విజయం సాధించి, ఇండియన్ సినిమా చరిత్రలో భారీ వసూళ్లు దక్కించుకుంది. ఇక ఆ సినిమా స్ఫూర్తితో మరిన్ని సినిమాలు తీయడానికి సన్నాహాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఎట్టకేలకు ప్రముఖ దర్శకుడు సుందర్.సి చారిత్రక నేపథ్యంలో ఓ భారీ సినిమాకు ప్లాన్ చేసాడు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది. తెలుగు వెర్షన్‌కు మహేష్‌బాబు, తమిళ వెర్షన్‌కు విజయ్ హీరోలుగా నటిస్తారని, ఇప్పటికే వీరిద్దరితో చర్చలు కూడా జరిపి ఓకే చేయించుకున్నాడు సుందర్ సి. ఇప్పుడు మహేష్ ఆ సినిమా చేయడం లేదని చెప్పినట్టు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఆయన మురుగదాస్ సినిమా కోసం ఎక్కువ కేర్ తీసుకోవడంవల్లే ఆ సినిమా చేయనని చెప్పినట్టు తెలిసింది. దాంతో మరి తెలుగులో ఏ హీరో నటిస్తాడో చూడాలి. మహేష్ ఎక్కువగా తెలుగు దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు. మణిరత్నం ప్రయత్నాలు చేసినా అది వర్కవుట్ కాలేదు. ఎస్.జె.సూర్య తరువాత మురుగదాస్‌కే మహేష్ అవకాశం ఇచ్చాడు మరి!