రజనీతో మరోసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన రోబో చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రజనీ, శంకర్‌ల కలయికలో రోబో-2 అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంపై దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నటిస్తుండగా, మరో కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ కూడా నటిస్తోందని కోలీవుడ్ సమాచారం. గతంలో రజనీకాంత్-రమ్యకృష్ణ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచాయి. రమ్యకృష్ణ స్థాయిని ఆ చిత్రాలే శిఖరాగ్రానికి తీసుకెళ్లాయి. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రోబో-2 చిత్రంతో మళ్లీ అదే సూపర్‌హిట్ టాక్ రిపీడ్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని చెబుతున్నారు. ఈ విషయంపై పూర్తి అవగాహన రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాలి. వైద్య చికిత్స నిమిత్తం అమెరికాలో వున్న రజనీకాంత్ ఈనెలాఖరుకు రాగానే రోబో-2 షూటింగ్‌లో పాల్గొననున్నారు. రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం ఈనెల 22న విడుదలకు సిద్ధమైంది.