చిరుతో రాములమ్మ రీఎంట్రీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అవార్డులు రివార్డులు అందుకున్న జంట చిరంజీవి-విజయశాంతి. వీరిద్దరి కలయికలో అనేక హిట్ చిత్రాలు విజయఢంకా మ్రోగించాయి. విజయశాంతి, చిరంజీవి వున్నారంటే ఆ సినిమా మినిమమ్ హిట్ అన్నమాటే. అయితే, ‘గ్యాంగ్‌లీడర్’ తరువాత వారిద్దరూ కలిసి నటించిన ‘మెకానిక్ అల్లుడు’ విడుదలయ్యాక ఇద్దరూ కలిసి నటించిన చిత్రం మళ్లీ రాలేదు. వీరిద్దరి హిట్ చిత్రం కోసం అటు మెగా అభిమానులు, ఇటు విజయశాంతి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వారి కల ఇప్పటికి మళ్లీ నెరవేరబోతోంది. చిరంజీవి నటిస్తున్న 150వ సినిమాలో కథానాయిక ఎవరు అని గత కొంతకాలంగా తర్జన భర్జనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గత రెండు రోజులనుంచీ టాలీవుడ్‌లో విజయశాంతి హీరోయిన్‌గా నటించనున్నదనే మాట వినబడుతోంది. సినిమాలో ఓ కీలకమైన పాత్ర ఉండడంతో ఆ పాత్రకు విజయశాంతి అయితే నప్పుతుందని దర్శకుడు వినాయక్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. త్వరలో సినిమా యూనిట్ విజయశాంతిని కలిసి ఆమె కాల్షీట్లు తీసుకోనున్నారట. రాజకీయంగా కూడా విజయశాంతి, చిరంజీవి పరస్పర ఆరోపణలు చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి నటించనున్న ఈ సినిమా ఎలా వుండబోతోంది? ఆ చిత్రంలో విజయశాంతి పాత్ర ఎలా వుండనుంది అనేదే ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఏ విషయమైనా త్వరలో వెలువడనుంది. అప్పటికిదాకా అభిమానులు వేచి చూడాల్సిందే!