నిహారికకు మరో ఛాన్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక నటించిన తొలి సినిమా ‘ఒక మనసు’ చిత్రం ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాతో హీరోయిన్‌గా వెలగాలని అనుకున్న నిహారికకు తీవ్ర నిరాశే ఎదురైంది. దాంతో తన భవిష్యత్ ప్రణాళిక ఏంటనే సందేహంలో వున్న నిహారికకు తాజాగా మరో అవకాశం దక్కింది. ఈమెతో ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సన్నాహాలు చేస్తున్నాడు. కొత్త దర్శకులను పరిచయం చేయడంలో దిల్‌రాజు ముందుంటాడు. ఇప్పుడు మరో కొత్త దర్శకుణ్ణి పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మిస్తున్నాడని తెలిసింది. ఇప్పటికే అతను చెప్పిన కథ బాగా నచ్చడంతో నిహారికతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. నిహారిక నటిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. గ్లామర్ పాత్రలు చేయడానికి ఆసక్తిని చూపించని ఈమెతో రూపొందే ఈ చిత్రం ఎలా వుంటుందో చూడాలి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి.