డైరెక్షన్ చేస్తే వేరే హీరోతోనే సినిమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామెడీ హీరోగా తెలుగులో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి సరికొత్త టైటిల్స్‌తో ప్రయోగాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘సెల్ఫీరాజా’. ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో గోపీ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు విడుదలవుతున్న సందర్భంగా ముఖాముఖీలో పాల్గొన్న నరేష్ రెండేళ్ల తరువాత దర్శకత్వం చేయాలనుకుంటున్నానని, అలా చేయాల్సి వస్తే నా సినిమాలో హీరో వేరేవాళ్లే ఉంటారని అంటున్నాడు. మిగతా వివరాలు ఆయన మాటల్లోనే..

* సెల్ఫీరాజా కథేంటి?
- ఈమధ్య ఎక్కువగా సెల్ఫీల హవా బాగా వుంది. ప్రతిఒక్కరూ సెల్ఫీలు తీసుకోవడానికి తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఒకరకంగా ఇది పిచ్చిలా తయారైంది. అలాంటి సెల్ఫీల పిచ్చివున్న వ్యక్తి కథ ఇది. దాంతోపాటు అతనికి నోటిదురుసువల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, తన ప్రాణాల్ని కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేదే ఈ కథ.
* ఈ టైటిల్ కావాలనే పెట్టారా?
- కాదు. కథ ప్రకారమే పెట్టాం. ఇందులో హీరో సెల్ఫీల పిచ్చి ఉన్నోడు. దాంతోపాటు సెల్ఫీ అనేది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టాం.
* మీరు సెల్ఫీలు తీసుకుంటారా?
- పెద్దగా ఇష్టముండదు.
* మీ కెరీర్‌కు ఈ సెల్ఫీరాజా ఎంతవరకు ఉపయోగపడుతుంది?
- ‘సుడిగాడు’ సినిమా తరువాత నేను చేసిన ఏడెనిమిది సినిమాల్లో ఒక్కదాంట్లోనూ స్ఫూఫ్‌లు చేయలేదు. ఈ సినిమాలో ఒక్క సీన్‌లో అనుకోకుండా వుంటుంది. స్ఫూఫ్‌లు చేస్తున్నాడని ఎక్కువ పేరు రావడంతో దాన్ని మానేశాను. కానీ, అవి జనాలకి కూడా నచ్చలేదేమో. నా నుండి వాళ్లు కామెడీనే ఆశిస్తున్నారు. కాబట్టి ఈ సినిమాలో వారికి కావాలసినంత కామెడీ వుంటుంది. తప్పకుండా నా కెరీర్‌కు మరో హిట్ దొరుకుతుందని ఆశిస్తున్నాను.
* మీ నాన్నగారి సినిమాలు రీమేక్ చేయరా?
- ఆలోచన కూడా వుంది. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాకు రీమేక్‌గా ‘ఆ ఒక్కటే అడుగుతా’ అనే టైటిల్‌తో సినిమా చేయాలని అనుకున్నాం. రాజేంద్రప్రసాద్ మామగా, నేను అల్లుడిగా, రంభ అత్తగా నటించాలనే ఆలోచనైతే వుంది.
* డైరెక్షన్ ఎప్పుడు?
- ఆలోచనైతే వుంది కానీ మరో రెండేళ్లు పట్టొచ్చు. నేను డైరెక్షన్ చేస్తే అందులో వేరే హీరో వుంటాడు.
* తదుపరి చిత్రాలు
- ప్రస్తుతం నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ షూటింగ్ జరుగుతోంది. దాని తరువాత ‘మేడమీద అబ్బాయి’, అలాగే తమిళ్‌లో నవంబర్ నుంచి మరో సినిమా వుంటుంది. మా సొంత బ్యానర్‌లో సమ్మర్‌లో విడుదలయ్యేలా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం.

-శ్రీ