నవీన్ చంద్ర కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్, నవీన్ చంద్ర (అందాల రాక్షసి ఫేం) కధానాయకుడిగా ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇ.సత్తిబాబు దర్శకత్వంలో పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈనెల 18 నుండి శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రాధామోహన్ మాట్లడుతూ, ప్రేక్షకులకు వందశాతం వినోదాన్ని అందించే ఈ చిత్రంలో ప్రతి పాత్రా నవ్విస్తుందని తెలిపారు. తమ సంస్థలో పూర్తి వినోదాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సత్తిబాబు బాగా రూపొందిస్తారన్న నమ్మకంతో ఆయనకు బాధ్యతలు అప్పగించామన్నారు. దాదాపు 20 ప్రధాన పాత్రలు ఈ సినిమాలో నవ్విస్తాయని, కథానాయికను త్వరలో ఎంపిక చేస్తామని తెలిపారు.